Republic day speech in telugu 2021 Ganatantram dinotasan ప్రసంగం 2021

republic day speech in telugu 2021
republic day speech in telugu 2021
Republic day speech in Telugu 2021 – Hello guys welcome to our blog here we are comes with January 26 speech in Telugu 2021. Read this full 26 January speech in Telugu 2021 and Share This beautiful speech about ganatantra dinotsavam speech in Telugu. we all know 26 January this day how much it all means to we Indians.

Share your love for your country with these best republic day in Telugu speech and 26 January speech in Telugu 2021.IN this essay I briefly explain the importance of republic day in Telugu. If you guys studied in Telugu school this ganatantra dinotsavam speech for you.

Republic day 2020 speech in telugu

So without wasting your time lets start these republic speech in telugu 2021,if you love these about republic day speech in telugu 2021 do share this telugu ganatantram dinotasan 2021 speech

Republic Day Speech In Telugu 2021 For Teachers

రిపబ్లిక్ డే ప్రసంగం – 1


రిపబ్లిక్ డే..అంటే దీని ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు. సరదాగా ఇంటి పట్టున ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతోనూ కాలం వెల్లదీస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలనే తృణప్రాయంగా భావించి, స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రోజు ఎంత మంది స్మరిస్తున్నారు? జాతీయ సెలవు రోజున ఎంత మంది వారి ఆదర్శాలను వల్లించు కుంటున్నారు? దేశ స్వాతంత్ర మీద నేటి యువతకి ఎంత అవగాహన ఉంది? అన్న అంశాలపై ఎవరైనా సర్వే నిర్వహిస్తే సిగ్గుతో తలదించుకునే విషయాలు వెలుగుచూస్తాయి.

అసలు రిపబ్లిక్‌డేను జనవరి 26నే ఎందుకు జరుపుకోవాలి? అనే ఈ ప్రశ్నకు సరైన సమాధానం చాలా మందికి తెలియదు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం సిద్ధించింది.. అలాగే 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది… కాబట్టి ఏటా అదే తేదీన రిపబ్లిక్ డే జరుపుకుంటున్నామని భావిస్తారు. ఇందులో కాస్త నిజం లేకపోలేదు. అయితే దీని వెనుక బలమైన కారణం ఉంది. వాస్తవానికి భారత రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26నే ఆమోదించారు. దీనిని అమలు చేసే తేదీకి ఒక ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో రెండు నెలలు ఆగారు.

లాహోర్ వేదికగా 1930 జనవరి 26న కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో తొలిసారిగా పూర్ణ స్వరాజ్యం తీర్మానం చేశారు. రావీ నది ఒడ్డున త్రివర్ణ పతాకం ఎగురవేసి భారతీయుల సంకల్పాన్ని బ్రిటిషర్లకు గట్టిగా వినిపించారు. అప్పటి దాకా కేవలం రాజకీయ, ఆధ్యాత్మిక స్వాతంత్రం వస్తే చాలు, సంపూర్ణ అధికారం భ్రిటిష్ వారి చేతుల్లోనే ఉండి, దేశం సామంత రాజ్యంగా మిగిలిపోయినా ఫర్వాలేదనుకునేలా ఉన్న రాజకీయ నేతల వైఖరిని జలియన్‌వాలాబాగ్ ఉదంతం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నాడు సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీలో వేడి పుట్టించి పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకటన చేయించడంలో సఫలమయ్యారు. ఆ రోజునే స్వాతంత్ర్య దినోత్సవంగా పరిగణించాల్సిందని కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపు కూడా ఇచ్చింది. అంతటి చారిత్రక ప్రాధాన్యం ఉన్న తేదీకి చిరస్థాయి కల్పించాలన్న సదుద్దేశంతో నవభారత నిర్మాతలు మరో రెండు నెలలు ఆగి 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చారు.


నాటితో ఈ రోజున బ్రిటీష్ కాలంనాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దుకాబడి, భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశానికి రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శినికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్‌‌ను ఏర్పాటుచేశారు. దీనికి అధ్యక్షుడిగా డాక్టర్‌ బాబూ రాజేంద్రప్రసాద్‌ ఎన్నిక కాగా, డాక్టర్‌ అంబేడ్కర్‌ ఛైర్మన్‌గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. రాజ్యాంగ రచనకు ఎంతోమంది మేధావులు వివిధ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి, అధ్యాయనం చేసి ప్రజాస్వామ్య విధానంగా రూపొందించారు. అనేక సవరణల అనంతరం, 1949 నవంబర్‌ 26న దీనిని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించింది. భారత రాజ్యాంగాన్ని రూపొందించేందుకు రెండు సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలం పట్టింది.

Republic day speech in telugu 2021 for Students

రిపబ్లిక్ డే ప్రసంగం – 2


ముందుగా అందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటంటే రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజైన జనవరి 26. అందువలన మనం ఈరోజును రిపబ్లిక్ డే గా జరుపుకుంటున్నాము. మనకు బ్రిటిష్ వారి నుండి 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనం బ్రిటిష్ వారి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేసుకున్నాము. మన రాజ్యాంగ పరిషత్తు వారు రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చినది జనవరి 26. అందువలన ఈరోజు కులాలు, మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జరుపుకోవాల్సిన జాతీయ పండుగ.

రిపబ్లిక్ డే ప్రసంగం-3

మన పాఠశాలలోని HMకు, టీచర్లకు మరియు మన అతిథులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇది ఒక జాతీయ పండుగ. భారతదేశంలోని ప్రతి భారతీయుడు జనవరి 26ను ఎంతో గొప్పగా ఉంటాడు జరుపుకుంటాడు. రిపబ్లిక్ / గణతంత్రం అనగా రాజ్యాధినేత ప్రజల చేత ప్రత్యక్షంగా గాని లేక పరోక్షంగా గాని ఎన్నిక కావడం. అందుచేత మన రాజ్యా ధినేత అయిన రాష్ట్రపతి ఆ రోజున జెండా ఎగుర వేస్తారు. మనకు 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ మనకు రాజ్యాంగం లేదు. అందువలన బి.ఆర్. అంబేద్కర్ మరియు మిగిలిన సభ్యుల కృషి వలన మన రాజ్యాంగం జనవరి 26, 1950 నాడు అమలులోకి వచ్చింది. అందువలన ఈరోజు మనకు ప్రత్యేకమైనది.

రిపబ్లిక్ డే ప్రసంగం-4


పిల్లలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. ఈరోజు మనమందరం ఇక్కడ సమావేశం కావడం యొక్క దేశం ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే జనవరి26, 1950 నాడు మనచే రచించిన మన రాజ్యాంగం ఈ రోజున అమలు లోకి వచ్చింది. అందువలన 26న గణతంత్ర దినోత్సవం గా మనం జరుపుకుంటున్నాము. ఈ రోజున భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగరవేస్తారు. ఆయన ఎగురవేసిన తర్వాతనే మనం ఎగురవేయవలెను. ఎందుకంటే ఆయన మనకు రాజ్యాధినేత మరియు రాజ్యంగా సంరక్షకుడు. ఇది కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి భారతీయ భారతదేశ పౌరుడు ఎంతో గొప్పగా జరుపుకోవాల్సిన పండుగ.

So guys these are the best republic day speech in Telugu 2021 for students and teachers,i hope you guys love these republic day speech in Telugu 2021 and do write these ganatantram dinotasan speech 2021 and if you are teachers do share one of the republic day speech in Telugu 2021 with your students and motivate them.

Republic day speech in Telugu 2021 download pdf

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here